News August 10, 2024

ధవళేశ్వరం బ్యారేజీ UPDATE

image

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 6.81 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.40 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Similar News

News November 11, 2025

పదేళ్లుగా బ్యాంకు ఖాతాల్లో నిలిచిపోయిన నగదు

image

తూ.గో జిల్లాలోని పలు బ్యాంకుల్లో లావేదేవీలు జరగకపోవడంతో పదేళ్లలో రూ.97.12 కోట్లు ఖాతాదారుల ఖాతాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యక్తి గత ఖాతాలు 5,09,614 కాగా నగదు రూ.75.05 కోట్లు ఉందన్నారు. పరిశ్రమలు ఖాతాలు 20,180 కాగా రూ.4.21 కోట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ ఖాతాలు 5,154 కాగా రూ.4.21 కోట్లుగా నిర్ధారించారు. ఈ నగదు e-KYC, నామినీ పేర్లు తదితర వివరాలు సరిగా లేకపోవడంతో బ్యాంకులో నిల్వ ఉందన్నారు.

News November 11, 2025

రాజమండ్రి: ‘ఇప్పుడు ఇంటి పన్ను కట్టడం నిమిషాల్లో పని’

image

జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణ పంచాయతీ’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా కేవలం ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చన్నారు.

News November 10, 2025

రాజమండ్రి: ‘ఇప్పుడు ఇంటి పన్ను కట్టడం నిమిషాల్లో పని’

image

జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణ పంచాయతీ’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా కేవలం ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చునన్నారు.