News July 22, 2024

ధవళేశ్వరం UPDATE.. 2వ ప్రమాదహెచ్చరికకు ఛాన్స్

image

ధవలేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిందని డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మంగళవారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం జిల్లా, మండల స్థాయి ప్రత్యేకాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వరదలపై సమీక్షించారు. భద్రాచలం నుంచి ధవలేశ్వరం బ్యారేజీకి భారీగా వరద వస్తుందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు సిద్ధంగా ఉంచాలన్నారు.

Similar News

News October 8, 2024

తూ.గో: నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఎప్పటివరకంటే?

image

శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని జిల్లా మీదుగా మంగళవారం నుంచి ఈ నెల 12 వరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 8,10,12 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్, 9, 11 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 8, 2024

పిఠాపురంలో మద్యం తాగించి బాలికపై అత్యాచారం

image

పిఠాపురంలో బాలికపై అత్యాచారం జరిగింది. కుటుంబీకుల వివరాలు.. స్టువర్టుపేటలో ఓ బాలిక నడిచివెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆటోలో మాధవపురం డంపింగ్ యార్డ్ తీసుకెళ్లారు. కాసేపయ్యాక ఆమెను ఆటోలో ఎక్కిస్తుండగా ఓ మహిళ చూసి నిలదీసింది. బాలిక బంధువులకు ఫోన్ చేయగా అక్కడికి చేరుకొన్నారు. మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదుచేయగా CI శ్రీనివాస్, SI మణికుమార్ కేసు నమోదుచేశారు.

News October 8, 2024

అన్నవరం: సత్యనారాయణ స్వామి ప్రసాదంలో విజయ నెయ్యి..!

image

తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేవదాయశాఖ అధికారులు పలు ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో ఇక నుంచి విజయ నెయ్యిని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్టర్ గడువు ముగియడంతో దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఈ నెయ్యినే వినియోగించనున్నట్లు సమాచారం.