News November 10, 2024

ధాన్యం అమ్మాలంటే కష్ట పడాల్సిందే..!

image

భూమి చదును చేసి, నారు మడులు సిద్ధం చేసుకొని, నాటు వేసి.. పంట చేతికొచ్చి.. విక్రయించి చేతికి డబ్బులు వచ్చే దాక రైతుకు అన్ని కష్టాలే. కొన్ని చోట్ల ముందస్తు వరి కోతలు షురూ కాగా..మరి కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి. పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్ల పై ఎండ బెట్టారు. ధాన్యంలో తేమశాతం తగ్గేలా ఓ రైతు ధాన్యాన్ని తిరగేస్తున్న దృశ్యాన్ని ‘WAY2NEWS’ పిట్లంలో హై వే-161 వద్ద తన కెమెరాలో బంధించింది.

Similar News

News November 14, 2024

NZB: ‘రిజిస్ట్రేషన్‌ సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం’

image

నిజామాబాదు జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్‌ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పది రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యాలయ సిబ్బంది ఎలాంటి బందులు పాటించడం లేదని తెలిపారు.

News November 14, 2024

ACBకి చిక్కిన లింగంపేట ఎస్ఐ

image

కామారెడ్డి జిల్లా లింగపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామాస్వామి పోలీస్ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 14, 2024

శ్రీ చైతన్య కాలేజీలో కామారెడ్డి విద్యార్థి ఆత్మహత్య

image

హైదరాబాద్‌లోని నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకున్న విద్యార్థి జస్వంత్ గౌడ్ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం విద్యార్థులు లేచి చూసేసరికి జస్వంత్ మృతి చెంది ఉన్నట్లు సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు.