News April 3, 2024
ధాన్యం కొనుగొలుకు కంట్రోల్ రూమ్: కలెక్టర్ ఎస్ వెంకట్రావు

ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రత్యేకంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. ఏమైనా సందేహాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా నేరుగా రైతులు కంట్రోల్ రూం నంబర్ కు 6281492368 నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించడం జరిగిందని రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందానని సూచించారు.
Similar News
News February 12, 2026
శాలిగౌరారం: చిన్నారిపై వీధి కుక్క దాడి

ఆకారం గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న మనస్వి అనే 15 నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచింది. రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది హేమంత్, సమీర్ చిన్నారిని హుటాహుటిన నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడదపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 12, 2026
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలి: కలెక్టర్ చంద్రశేఖర్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల పరిశీలకుడు జి.రమేష్‌తో కలిసి ఆర్జాలబావిలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని తెలిపారు.
News February 12, 2026
నల్గొండ: మున్సిపల్ పోరులో ‘సింహం’ గర్జిస్తుందా?

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో AIFB అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్లు దక్కని పలువురు నేతలు ‘సింహం’ గుర్తుపై పోటీకి దిగారు. మొత్తం 48 డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 11 మంది బరిలో నిలవగా, ఐదుగురు అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో సింహం గుర్తు ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని నగరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.


