News March 21, 2025
ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

రబీ సీజన్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో 2024-25 రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి 1,85,000 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామన్నారు.
Similar News
News November 25, 2025
19 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 19మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. సీపీ సునీల్ దత్ మంగళవారం వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. వీరిలో నలుగురిని మహబూబాబాద్‌కు, 14 మందిని భద్రాద్రి కొత్తగూడెంకు, ఒకరిని ఇతర విభాగానికి కేటాయించారు.
News November 25, 2025
ఖమ్మం కార్పొరేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల హవా!

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అధికార కాంగ్రెస్ కార్పొరేటర్ల కంటే బీఆర్ఎస్ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మున్సిపల్ కాంట్రాక్టులు, ఎల్ఆర్ఎస్ పనులలో అధికారులు వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై, రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
News November 25, 2025
ఖమ్మం: అంతా ‘మొంథా’ర్పణం

ఖమ్మం జిల్లాలో ‘మొంథా’ తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ సర్వేచేసి తుది నివేదిక విడుదల చేసింది. జిల్లాలో 17మండలాల్లో 4,268మంది రైతులకు చెందిన 1, 710.72హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని తేల్చారు. 1,499.43 ఎకరాల్లో వరి, 115.82హెక్టార్లలో పత్తికి నష్టం వాటిల్లిందిని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. అత్యధికంగా కూసుమంచి డివిజన్లో 766.12 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.


