News November 3, 2024
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి: మంత్రి

ఖమ్మం: నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి ఉత్తమ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కూసుమంచి తహశీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
ఖమ్మం జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా ఏదులాపురం!

ఖమ్మం రూరల్ మండలంలోని 12 పంచాయతీలతో ఏర్పడిన నూతన ఏదులాపురం మున్సిపాలిటీ, జిల్లాలోనే అత్యధిక ఓటర్లు (45,256), వార్డులు (32) కలిగిన పురపాలికగా నిలిచింది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. 26 అభ్యంతరాలు రాగా, బీఎల్ఓల విచారణ అనంతరం ఈ నెల 10న తుది జాబితా ప్రకటించనున్నారు. అత్యధికంగా ఒకటో వార్డులో 1,710 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
News January 8, 2026
ఖమ్మంలో రేపు జాబ్ మేళా

ఖమ్మం: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.శ్రీరామ్ తెలిపారు. ఫార్మసీ కోర్సులు చేసిన వారితో పాటు పదో తరగతి, ఇంటర్ అర్హత ఉన్న వారు కూడా హాజరుకావచ్చు. నెలకు రూ.25 వేల వరకు జీతం పొందే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు మేళాకు రావాలని ఆయన కోరారు.
News January 8, 2026
ఖమ్మం మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా..!

ఖమ్మం సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో కూరగాయల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారి శ్వేత గురువారం విడుదల చేశారు. టమాట కేజీ రూ. 34, వంకాయ 20, గుత్తి వంకాయ 40, బెండకాయ 60, పచ్చిమిర్చి 38, కాకరకాయ 56 కంచ కాకరకాయ 60, బోడ కాకరకాయ 140, బీరకాయ 46, పొట్లకాయ 40, దొండకాయ 56, నాటు దోసకాయ 50, బుడం దోసకాయ 60, చిక్కుడు 20, నాటు చిక్కుడు 40, ఆలుగడ్డ 22, చామగడ్డ 28, ఆకుకూరలు 20కి ఐదు కట్టల చొప్పున ఇస్తున్నారు.


