News March 30, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: అదనపు కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, సివిల్ సప్లై డీఎం అంబాదాస్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
Similar News
News December 17, 2025
గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సందడి..!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి రూ.కోట్లలో పందేలు జరగడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడ ఎలా బరులు ఏర్పాటు చెయ్యాలి..? ఎవరు ఎవరితో సిండికేట్ అవ్వాలి..? వీఐపీలు, పందెం కాసే వారికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలి..? పందేల నిర్వహణ ఎలా జరపాలనే అంశాలపై పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.
News December 17, 2025
ధనుర్మాసం: రెండవరోజు కీర్తన

‘భాగ్యవంతులైన గోకుల గోపికలారా! ఈ ధనుర్మాస వ్రతంలో మన కర్తవ్యం నారాయణుని పాదాలను కీర్తించడం. వ్రత కాలంలో ఇతర విషయాలు తలవకుండా, పాలు, నేతిని తాగడం, కంటికి కాటుక, సిగలో పూలు ధరించడం వంటివి మానేయాలి. శాస్త్ర విరుద్ధ పనులు చేయరాదు. చాడీలు చెప్పవద్దు. సన్యాసులు, బ్రహ్మచారులకు దానాలు చేయాలి. మనకు మోక్షాన్ని ఇచ్చే ఇతర మార్గాలన్నీ సంతోషంగా ఆచరించాలి. ధనుర్మాసమంతా ఈ నియమాలనే పాటించాలి’. <<-se>>#DHANURMASAM<<>>
News December 17, 2025
మెదక్: నాడు భర్త ఉప సర్పంచ్.. నేడు భార్య సర్పంచ్

గత ఎన్నికలలో గెలిచి భర్త పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా సేవలు అందించగా నేడు భార్య సర్పంచ్‌గా గెలిచి సేవలు అందించనున్నారు. మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారంలో సర్పంచ్‌గా చింతకింది దివ్య గెలుపొందారు. ఒకే కుటుంబంలో భర్త, భార్య గెలిచి నిలిచారు.


