News April 16, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి రోజు కేంద్రాలను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్ అధికారులను ఆదేశించారు. జనగామ మండలం పెంబర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్ ఓపీఎంఎస్‌లో నమోదు చేయాలన్నారు.

Similar News

News November 23, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> రఘునాథపల్లి: టైర్లు పేలి మినీ డీసీఎం బోల్తా
> జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేసిన కలెక్టర్
> జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇందిరమ్మ చీరల పంపిణీ
> రేపటి ప్రజావాణి కార్యక్రమంలో రద్దు
> టీఆర్టీఎఫ్ జనగామ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్
> జనగామలో బాల్య వివాహం నిలిపివేత

News November 23, 2025

సైలెంట్‌గా iBOMMA రవి..! ఏం చేద్దాం?

image

నాలుగో రోజు పోలిస్ కస్టడీలోనూ iBOMMA రవి నోరు విప్పలేదని సమాచారం. తన పర్సనల్ విషయాలపై ప్రశ్నలకు బదులిచ్చాడు తప్ప ఈ వ్యవహారంలో తనతో ఉన్నది ఎవరు? డేటా థెఫ్ట్, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో రిలేషన్, ఫారిన్ ట్రిప్స్ తదితర అంశాలపై ప్రశ్నిస్తే మౌనంగా ఉన్నాడట. 5 రోజుల కస్టడీ సోమవారం ముగియనుంది. దీంతో మరోసారి కస్టడీకి అడిగితే కోర్టు ఎలా స్పందిస్తుంది? ఏం చేద్దామని అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం.

News November 23, 2025

సంగారెడ్డి: సంపులో మృతదేహం లభ్యం.. గుర్తిస్తే చెప్పండి

image

సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో నూతనంగా నిర్మిస్తున్న సంపులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ రాము నాయుడు ఆదివారం తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, ఎవరైనా గుర్తిస్తే సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.