News February 11, 2025
ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు సంబంధించిన సన్నద్ధతపై ఆయన సమీక్షా నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా తదితర అధికారులున్నారు.
Similar News
News December 13, 2025
‘కాకినాడ కాదని.. దూరంలోని అమలాపురం ఎందుకు?’

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని RCPM, మండపేటలను కాకినాడ లేదా తూ.గోలో కలపాలన్న డిమాండ్ తీవ్రరూపు దాలుస్తోంది. కాకినాడ కంటే జిల్లా కేంద్రం అమలాపురం దూరం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండపేట విలీనం జరిగినా పాలనాపరమైన ఇక్కట్లు తప్పలేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ సమస్య పరిష్కారంలో మంత్రి సుభాష్ విఫలమయ్యారని, ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
News December 13, 2025
APPLY NOW: డిగ్రీ అర్హతతో 451 పోస్టులు

UPSC త్రివిధ దళాల్లో 451 పోస్టులను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026 ద్వారా భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ అర్హతగల వారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -24ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 13, 2025
మెస్సీ మ్యాచ్.. 3,000 మంది పోలీసులతో భద్రత

HYD ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రా.7.30 గంటలకు జరిగే రేవంత్vsమెస్సీ ఫుట్బాల్ మ్యాచుకు టికెట్ ఉన్న వారినే అనుమతించనున్నారు. ఈ మ్యాచుకు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. 450 CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 20ని.ల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచులో CM రేవంత్ ‘సింగరేణి RR9’ కెప్టెన్గా వ్యవహరిస్తారు. మ్యాచ్ తర్వాత మెస్సీతో పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.


