News November 20, 2024
ధాన్యం కొనుగోలు, సమగ్ర సర్వేపై కలెక్టర్‌తో రివ్యూ నిర్వహించిన సీఎస్
TS చీఫ్ సెక్రటరీ శాంత కుమారి నేడు జనగామలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ధాన్యం కొనుగోలు, సమగ్ర సర్వే మీద కలెక్టర్‌తో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సాఫిగా కొనసాగుతుందని, చెల్లింపులు కూడా ఎప్పటికప్పుడు అయ్యేలా OPMSలో వివరాలను నమోదు చేస్తున్నట్లు సీఎస్‌కు కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు దొడ్డు రకం ధాన్యానికి రూ.78 కోట్లు, సన్నలకు రూ.కోటి వరకు చెల్లించామన్నారు.
Similar News
News November 20, 2024
WGL: అన్నదాతలకు ఊరట.. రూ.80 పెరిగిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు నేడు రైతులకు స్వల్ప ఊరట నిచ్చాయి. సోమవారం రూ.6,750 పలికిన క్వింటా కొత్త పత్తి ధర.. మంగళవారం రూ.6,730కి చేరింది. ఈ క్రమంలో నేడు రూ.6,810 పలకడంతో అన్నదాతలకు స్వల్ప ఊరట లభించినట్లు అయింది. అయితే సిసిఐ నిర్దేశించిన ధరకు కొనుగోలు జరగడం లేదని రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News November 20, 2024
జనగామ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి.. UPDATE
జనగామ జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14656765>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. బచ్చనపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన కరుణాకర్, సాయిబాబా రైతులు. అయితే వారి ట్రాక్టర్లకు సామగ్రి తీసుకురావడానికి చేర్యాలకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ఢీకొట్టడంతో మృతి చెందారు. కాగా, బైకు నుజ్జునుజ్జయింది.
News November 20, 2024
వరంగల్ పట్టణానికి ఇందిరమ్మ ప్రభుత్వంలో మహర్దశ: మంత్రి
గత పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని తెలంగాణ సాంస్కృతిక రాజధాని వరంగల్ పట్టణానికి, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మహర్దశ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎయిర్ పోర్ట్, టెక్స్టైల్ పార్క్‌తో పాటు వరంగల్ పట్టణాన్ని సమగ్రంగా అన్ని రంగాల్లో ముందు నిలబెట్టడం కోసం మన ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనుందని చెప్పారు.