News March 20, 2025

ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలపై వనపర్తి కలెక్టర్ సూచన 

image

రైతుల నుంచి 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి రబీ సీజన్ వరి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Similar News

News March 21, 2025

మండపేట: ప్రియుడి కోసం తండ్రిని చంపిన కుమార్తె

image

వివాహేతర సంబంధం కోసం కుమార్తె తండ్రిని చంపేసిన ఘటన మండపేటలో జరిగింది. సీఐ సురేశ్ వివరాలు.. గ్రామానికి చెందిన రాంబాబు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో కేసునమోదు చేసి ఛేదించారు. కుమార్తె, ఆమె ప్రియుడు కలిసి హత్యచేసినట్లు తేల్చారు. కొత్తూరుకి చెందిన సురేశ్‌తో మహిళకు వివాహేతర సంబంధం ఉంది. తండ్రి మందలించడంతో ఈనెల 16న హత్యచేశారు. రామచంద్రాపురంలో నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.

News March 21, 2025

నల్గొండ ఫస్ట్.. సూర్యాపేటకు ఫోర్త్ ప్లేస్..!

image

రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా నల్గొండలోనే అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2,37,664 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో NLG మొదటి స్థానంలో ఉండగా.. 1,54,224 కనెక్షన్లతో సూర్యాపేట నాల్గో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,17,477 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్ల పరంగా చూస్తే.. నల్గొండ ఐదో స్థానంలో నిలిచింది.

News March 21, 2025

స్కూళ్లలో అల్పాహారం పథకం పెట్టాలి: KTR

image

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని KTR డిమాండ్ చేశారు. ‘తమిళనాడులో ఈ స్కీమ్‌ను అమలు చేయడం వల్ల ఆస్పత్రిలో చేరే పిల్లల సంఖ్య 63.2% తగ్గింది. తీవ్ర అనారోగ్య సమస్యలు 70.6% తగ్గాయి. విద్యార్థుల అభ్యాసం మెరుగుపడింది. ఈ ఫలితాలను చూసి BRS ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!