News October 25, 2024
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

వానకాలం ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా పౌరసరఫరాల అధికారులు, మార్కెటింగ్ ,డిఆర్డిఏ, సహకార, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం సేకరణ సమస్యలపై సమీక్షించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులను తగినంతగా ఉంచాలని, అలాగే ఇతర సౌకర్యాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
Similar News
News November 27, 2025
NLG: ఇక్కడ మహిళలే కీలకం

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పురుషులతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లు 28 వేల పైచిలుకు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అలాగే గంపగుత్త ఓట్ల కోసం కులసంఘాల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.
News November 27, 2025
NLG: రైతు పత్తికే వంక!… రైతన్నల అవస్థలు

దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొండమల్లెపల్లి, కట్టంగూరు, చండూరు మండలాల పరిధిలోని జిన్నింగ్ మిల్లులలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మిల్లుకు తెచ్చిన పత్తిని ఎలాంటి వంకలు పెట్టకుండా కొనుగోలు చేస్తున్నారని, రైతులు తెచ్చిన పత్తికి నానా వంకలు పెడుతున్నారని తెలిపారు.
News November 27, 2025
నల్గొండ: ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ఎస్సీ (SC) వర్గానికి చెందిన విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని SCDD డిప్యూటీ డైరెక్టర్ శశికళ తెలిపారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 9, 10వ తరగతి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.


