News October 31, 2024

ధాన్యం సేకరణలో సంపూర్ణ సహకారం అందించాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు, కష్టం మిల్లింగ్ రైస్ విషయంలో జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో 2024- 25 ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు కష్టం మిల్లింగ్ రైస్ కేటాయింపు, అదనపు మిల్లింగ్ ఛార్జీలపై సమావేశం నిర్వహించారు. ఈ వానాకాలం ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు.

Similar News

News November 2, 2024

NLG: తండ్రీకొడుకుల గల్లంతు

image

కనగల్ మండలంలోని శాబ్దల్లాపురం గ్రామ సమీపంలో ఏఎంఆర్పీ కాలువలో ఈతకు వెళ్లి తండ్రీకొడుకు గల్లంతయ్యారు. వారు సూరవరం దామోదర్, అతని కుమారుడు బిట్టుగా తెలుస్తోంది. వీరి ఆచూకీ కోసం కనగల్ ఎస్ఐ పి.విష్ణు, పోలీస్ సిబ్బంది, స్థానికులు గాలిస్తున్నారు.

News November 2, 2024

నల్లగొండ: అంగన్వాడీ పోస్టులపై ఆశలు 

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ల, హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ మహిళల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 162 టీచర్ల, 595 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయుటకు ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రాలున్న గ్రామాల్లో స్థానిక మహిళలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు.

News November 2, 2024

సాగర్ అభివృద్ధికి చర్యలు : మంత్రి జూపల్లి

image

నాగార్జునసాగర్, బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం అయన బుద్ధవనం పరిసర ప్రాంతాలను శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కమలేష్ డి.పాటిల్ తో కలిసి పరిశీలించారు. సాగర్ ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.