News March 6, 2025

ధూళ్‌మిట్ట: ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి

image

ధూళ్‌మిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు భోషనబోయిన సాయిలు(70) ప్రమాదవశాత్తు తన వ్యవసాయ బావిలో పడి బుధవారం రాత్రి మరణించారు. బావిలో పంపు మోటర్ చెడిపోవడంతో దానికి సాయిలు మరమ్మతులు చేపట్టారు. అనంతరం బావిలో నుంచి పైకి ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.

Similar News

News December 2, 2025

శ్రీలంకకు పాక్ సాయం.. ఎక్స్‌పైరీ ఫుడ్ అంటూ!

image

శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యవసర మానవతా సాయాన్ని అందించింది. అయితే ఇది చూసిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా శ్రీలంకకు ఫుడ్ ప్యాకేజీలను పంపింది. ఈ విషయాన్ని అక్కడి పాక్ హైకమిషనర్ కార్యాలయం ట్వీట్ చేయగా.. ఎక్స్‌పైరీ ఫుడ్ పంపినట్లు నెటిజన్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన వాటిని పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ మండిపడుతున్నారు.

News December 2, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* పిజ్జా చల్లబడి, గట్టిపడితే ఒక గిన్నెలో పిజ్జా ముక్కలు పెట్టి.. మరో గిన్నెలో వేడి నీళ్లు పోసి, అందులో పిజ్జాముక్కల గిన్నెను 5 నిమిషాలు ఉంచితే చాలు.
* ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్లు మండుతుంటే ఒక టిష్యూ పేపర్‌ను తడిపి, దానిపై ఉల్లిగడ్డను కట్ చేస్తే కళ్లు మండవు.
* గిన్నెలు మాడిపోయినప్పుడు ఓ గ్లాస్ పెప్సీని మాడిపోయిన గిన్నెలో పోసి వేడి చేసి, 10 నిమిషాల తర్వాత కడిగితే గిన్నెలు మెరిసిపోతాయి.

News December 2, 2025

భువనగిరి: ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచులు..!

image

బొమ్మలరామారం(M) చీకటిమామిడికి చెందిన మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబీకులు 4 పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. చంద్రమౌళి తొలిసారిగా 1995లో తర్వాత 2001లో కాగా 2007లో ఆయన తల్లి విజయం సాధించారు. 2013లో ఆయన సోదరుడు శ్రీనివాస్ గౌడ్ MPTCగా గెలుపొందగా 2019లో శ్రీనివాస్ సతీమణి వసంత సర్పంచ్‌గా గెలిచారు. దాదాపు 30ఏళ్లపాటు తమ కుటుంబం గ్రామానికి సేవలందించిందని, ప్రస్తుతం ఇతరులకు అవకాశం ఇచ్చామని శ్రీనివాస్ తెలిపారు.