News February 19, 2025
ధైర్యశాలి శివాజీ మహారాజ్: హరీష్ రావు

ధైర్యశాలి చత్రపతి శివాజీ మహారాజ్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో పేర్కొన్నారు.చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్కు నివాళులు అర్పించిన ఫోటోను పోస్ట్ చేశారు. చత్రపతి శివాజీ మహారాజ్ విజయనరీ కల లీడర్ అని, ఆయన అడుగుజాడలు యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారతజాతి వీరత్వానికి ప్రతీక, జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు అని కీర్తించారు.
Similar News
News October 20, 2025
తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదు..

చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ దీపావళి పండుగను జరుపుకుంటాం. అయితే దీని వెనక మరోకోణం కూడా ఉంది. వరాహస్వామి అంశతో భూదేవి నరకుడికి జన్మనిస్తుంది. నరకుడు బాణాసురిడి స్నేహంతో రాక్షస లక్షణాలను పొంది ప్రజలను, మునులను బాధించడం మొదలుపెట్టాడు. ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించిన భూదేవి విల్లంబులు చేతబట్టి నరకాసురుడిని వధిస్తుంది. తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదని పురాణాలు చెబుతున్నాయి.
News October 20, 2025
ADB: బీసీ విద్యార్థులకు శుభవార్త..!

బీసీ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించారు. విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. గత గడువు 15తో ముగియగా.. పొడిగించినట్లు పేర్కొన్నారు.
News October 20, 2025
మెదక్: 10వ తరగతి విద్యార్థిని సూసైడ్

పండగపూట మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. శివంపేట మండలం కొంతాన్పల్లిలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థిని ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.