News February 19, 2025
ధైర్యశాలి శివాజీ మహారాజ్: హరీష్ రావు

ధైర్యశాలి చత్రపతి శివాజీ మహారాజ్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో పేర్కొన్నారు.చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్‌కు నివాళులు అర్పించిన ఫోటోను పోస్ట్ చేశారు. చత్రపతి శివాజీ మహారాజ్ విజయనరీ కల లీడర్ అని, ఆయన అడుగుజాడలు యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారతజాతి వీరత్వానికి ప్రతీక, జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు అని కీర్తించారు.
Similar News
News March 28, 2025
మెట్రో ఎండీ పదవి కాలం కొనగించే అవకాశం..!

నిన్న ప్రభుత్వం టెర్మినేట్ చేసిన వారిలో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఉన్నారు. 2016లో రిటైర్డ్ అయిన మెట్రో ఎండీ, ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మరొకసారి ఎక్స్‌టెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది.
News March 28, 2025
గద్వాల: జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ

జమ్మిచేడు జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజాలు జరిపారు. పరిసర ప్రాంతాల, కర్ణాటక, రాయలసీమ ఇతర ప్రాంతాల భక్తులు, బంధువులతో పెద్దఎత్తున తరలివచ్చి కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
News March 28, 2025
భువనగిరి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, మైనార్టీ విద్యార్థులు పోస్టుమట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు పొడిగించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వసంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.