News March 4, 2025
ధ్రువపత్రంతో గాదె శ్రీనివాసులునాయుడు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులునాయుడు ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. ఆయనకు ఎన్నికల సంఘం ధ్రువపత్రాన్ని అందజేశారు. ఎలిమినేషన్ ప్రక్రియలో పదో రౌండ్లో పాకలపాటి రఘువర్మకు లభించిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించి విజేతను ప్రకటించారు. శ్రీనివాసులు నాయుడికి 12,035 ఓట్లు వచ్చాయి.
Similar News
News March 4, 2025
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా పర్యాటక అధికారి జ్ఞానవేణిని బదిలీ చేశారు. నూతన పర్యాటక శాఖ అధికారిగా జి.దాసును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బీచ్‌లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పర్యాటకులకు పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
News March 4, 2025
విశాఖ: మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు

మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. మొత్తం 29,997 మంది విద్యార్థులు 134 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు డీఈవో తెలిపారు.
News March 4, 2025
ఉత్తరాంధ్ర టీచర్ల MLC.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

➤ గాదె శ్రీనివాసులు నాయుడు: 12,035(గెలుపు)
➤ పాకలపాటి రఘువర్మ : 8,527
➤ కోరెడ్ల విజయ గౌరీ : 5,900
➤ నూకల సూర్యప్రకాశ్ : 89
➤ పోతల దుర్గారావు : 68
➤ సుంకర శ్రీనివాసరావు : 39
➤ రాయల సత్యనారాయణ : 32
➤ కోసూరు రాధాకృష్ణ : 31
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి : 15
➤ పెదపెంకి శివప్రసాద్ : 15
➤ ఇన్ వ్యాలీడ్ : 656