News March 4, 2025
ధ్రువీకరణ పత్రం అందుకున్న ‘గాదె’

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాస నాయుడుకి సోమవారం రాత్రి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ధ్రువీకరణ పత్రం అందజేయడంలో జాప్యం జరగడంతో పీఆర్టీయూ ఉపాధ్యాయులు విశాఖ ఏయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన మూడుసార్లు విజయం సాధించారు.
Similar News
News March 4, 2025
వికారాబాద్: పరీక్షలకు సర్వం సిద్ధం: శంకర్ నాయక్

జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు నోడల్ అధికారితో కలిసి పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8:45లోగా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు చేరుకోవాలని 9:05 నిమిషాల వరకు అనుమతి ఇస్తారన్నారు.
News March 4, 2025
SKLM: కంటి వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

గ్రామ స్థాయిలో కంటి వ్యాధులపై ఆప్తాల్మీక్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య DM&HO టీవీ బాలమురళీకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా DM&HO కార్యాలయంలో ఆప్తాల్మిక్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ప్రతి ఒక్క ఆప్తాలమిక్ అధికారి వారి పరిధిలో ఎన్జీవో ఆసుపత్రి వారు నిర్వహించే క్యాటరాక్ట్ క్యాంపులను సందర్శించి అంధత్వంతో బాధపడుతున్న వారికి రిఫర్ చేయాలన్నారు.
News March 4, 2025
MLC ఎన్నికల కోడ్ ఎత్తివేత

AP: ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేయనున్నారు. గత నెల 3నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.