News January 25, 2025

ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదు: కలెక్టర్

image

జిల్లాలో వంద శాతం జనన, మరణాల నమోదుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని ఆదేశించారు.

Similar News

News October 14, 2025

గిరిజన ఉత్పత్తులకు అధిక లాభాలు రావాలి: కలెక్టర్

image

జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ స్థాపించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులను మరింత పెంచాలన్నారు. వాటి నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకింగ్, మార్కెట్ సౌకర్యం కల్పించి అధిక లాభాలు వచ్చేలా చేయాలన్నారు.

News October 14, 2025

పెట్టుబడుల్లో వెండే ‘బంగారం’

image

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వీటిని సేఫెస్ట్ ఆప్షన్‌గా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ కంటే సిల్వర్‌ ఎక్కువ రిటర్న్స్ ఇస్తోందన్న విషయం తెలుసా? గత ఐదేళ్లలో బంగారంపై 33.15%, వెండిపై అత్యధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్‌‌ కేవలం 2.64% రిటర్న్స్ ఇవ్వగలిగింది. లాంగ్‌టర్మ్‌లో సిల్వర్, గోల్డ్ బెటర్ అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

News October 14, 2025

బద్దిపడగ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎమ్ సస్పెండ్

image

సి్ద్దిపేట జిల్లా నంగునూర్ మండలం బద్దిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM పద్మను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్వీస్ నుంచి సస్పెండ్ చేశామని DEO తెలిపారు. జిల్లా కలెక్టర్ పాఠశాల సందర్శనలో విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడం, అమలు చేయకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.