News January 25, 2025
ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదు: కలెక్టర్

జిల్లాలో వంద శాతం జనన, మరణాల నమోదుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని ఆదేశించారు.
Similar News
News February 12, 2025
సర్కారు బడిలో సార్ బిడ్డ..!

సర్కారు బడి బలోపేతం కోసం మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు ఈ టీచర్. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకి చెందిన నర్సింగ్ నరేశ్ పాలకీడు ZPHS తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె నర్సింగ్ నేహాను కీతవారిగూడెం ZPHSలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీచర్‌ల కాంప్లెక్స్ మీటింగ్ కీతవారిగూడెంలో నిర్వహించగా ఈ విషయం తెలియడంతో HM సువర్ణ, టీచర్లు నరేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
News February 12, 2025
వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం

TG: వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి(మ) నాగవరం శివారులో రెండెకరాల్లో టవర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.22 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఐటీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
News February 12, 2025
చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ, జీవనోపాదులుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరుల లభ్యత అధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవడం వలన జలవనరులు పెరిగి, అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.