News July 16, 2024
నంగునూరు: సూక్ష్మరాతి పనిముట్లు లభ్యం

నంగునూరు మండల కేంద్రానికి చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సూక్ష్మరాతి పనిముట్లను గుర్తించాడు.గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో పరిశోధనలు చేస్తున్న ఆయన కొత్తరాతి యుగం నాటి రాతి గొడ్డళ్ళు,శాతవాహనుల కాలం నాటి టెర్రకోట బొమ్మలు,పూసలు,దేవత విగ్రహలు ఎన్నో గుర్తించాడు.ఇప్పుడు కొత్తగా గ్రామానికి దక్షిణం వైపున ఉన్న జోకిరమ్మ బండ మీద సూక్ష్మరాతి పరికరాలు (మైక్రోలిథిక్ టూల్స్) గుర్తించాడు.
Similar News
News November 26, 2025
మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

మెదక్ కలెక్టరేట్లో మీడియా సెంటర్ ప్రారంభం

మెదక్ కలెక్టరేట్లో మీడియా సెంటర్ను డీపీఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు.