News March 21, 2025

నందనవనంగా అమరావతిని మార్చుకుందాం

image

AP రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. దాదాపు 30 వేల ఎకరాల్లో భారీ ప్రాజెక్టుల సమాహారం ఇది. అయితే మహానగరంగా ఎదిగే ఏ ప్రాంతమైనా ఎదుర్కొనే ప్రధాన సమస్య పర్యావరణం. అందుకు ప్రభుత్వమే కాదు మనమూ నైతిక బాధ్యత వహించాలి. ప్రకృతితో స్నేహం చేస్తూ ఇంటికో చెట్టు పెంచాలి. ప్రకృతి ఒడిలో ఓలలాడేలా, పచ్చదనం విరబూసే నందనవనంలా అమరావతిని అలంకరించాలి. మీరేమంటారు.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.

Similar News

News April 21, 2025

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జోష్య హరిణిరెడ్డి(6) మృతి చెందింది. ఆదివారం ఉదయం కారును బొలెరో ఢీకొనడంతో చిన్నారితోపాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తాడిపత్రి ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపూర్ తీసుకెళ్తుండగా జోష్య మృతి చెందినట్లు కొలిమిగుండ్ల సీఐ మద్దినేని రమేశ్ వెల్లడించారు.

News April 21, 2025

కర్నూలు: పిడుగుపాటుతో యువకుడి మృతి

image

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల గోవిందు కుమారుడు గొల్ల ఈరన్న మరికొందరు ఆదివారం రాత్రి ఎమ్మిగనూరు SML డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్నారు. అక్కడ ఒక్కసారిగా మెరుపులతో పిగుడు పడింది. దీంతో అక్కడున్న నలుగురు స్వల్ప గాయాలు కాగా.. ఈరన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

పిట్టలవానిపాలెం: ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి

image

ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందిన ఘటన పిట్టలవానిపాలెం మండలంలో ఆదివారం చోటుచేసుకొంది. చందోలు ఎస్ఐ శివకుమార్ వివరాల మేరకు.. మండలంలోని అలకాపురంలో కనకా రెడ్డి ట్రాక్టర్‌తో రొయ్యల చెరువు కట్టను వెడల్పు చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడటంతో ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

error: Content is protected !!