News July 14, 2024
నందలూరు: ఆర్టీసీ కండక్టర్ను వెంటాడిన మృత్యువు

నందలూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడగా కండక్టర్ రాముడు(40) మాత్రం మృతి చెందారు. ప్రమాద సమయంలో కండక్టర్ బస్సులో నుంచి బయటికి ఎగిరిపడ్డారు. తిరిగి లేచి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో లారీలో ఉన్న ఐరన్ కాయిల్ మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.
Similar News
News December 2, 2025
కడప: జిల్లాలో రూ.83.38 కోట్ల మద్యం విక్రయం

కడప జిల్లాలో నవంబరు నెలలో రూ.83.38 కోట్ల మద్యాన్ని విక్రయించారు. 44,233 కేసులు బీర్లు, 1,24,430 కేసులు మద్యం విక్రయించారు. కడపలో రూ.22.85 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.15.61 కోట్లు, మైదుకూరులో రూ.7.74 కోట్లు, సిద్దవటంలో రూ.2.43 కోట్లు, పులివెందులలో రూ.9.73 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.6.62 కోట్లు, ముద్దనూరులో రూ.3.52 కోట్లు, జమ్మలమడుగులో రూ.5.74 కోట్లు, బద్వేల్లో రూ.9.10 కోట్లు మద్యాన్ని విక్రయించారు.
News December 1, 2025
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
News December 1, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,790
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,767
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1750


