News November 14, 2024

నందలూరు: వర్రా, సజ్జల భార్గవ్‌పై మరో కేసు

image

నందలూరు పోలీస్ స్టేషన్‌లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సిరిగిరి అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ. ఐటీ చట్టాల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్దవటం మండలానికి చెందిన వాకమల్ల వెంకటాద్రి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో వీరిపై 20 కేసులు నమోదయ్యాయి.

Similar News

News December 7, 2025

కడప మేయర్ ఎన్నికకు ఆహ్వానం.!

image

కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి కార్పొరేటర్ ఈనెల 11 జరిగే ప్రత్యేక సమావేశానికి రావాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ లేఖలు పంపించారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో ఉదయం 11 గంటలకు నూతన మేయర్‌ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు.

News December 7, 2025

పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

image

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.