News September 6, 2024
నందికొట్కూరులో మహిళ దారుణ హత్య
నందికొట్కూరులోని మారుతీ నగర్‌కు చెందిన శాలు బీ(45) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రామాంజీ నాయక్, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 8 మంది అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 10, 2024
నంద్యాల చిత్రకారుడి ప్రతిభ.. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపం
నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ మరోసారి తన టాలెంట్ చూపెట్టారు. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపాన్ని చిత్రీకరించి అబ్బురపరిచారు. బాబాపై ఉన్న భక్తి, ప్రేమతో ఈ చిత్రాన్ని వేసినట్లు ఆయన తెలిపారు. ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అన్న నినాదం ఈ చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ప్రస్తుత సమాజానికి బాబా బోధనలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
News October 10, 2024
100 రోజుల ప్రణాళికలను సాధించాలి: కలెక్టర్
డిసెంబర్ 31వ తేది లోపు రెండో దశ 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 100 రోజులు లక్ష్యాల (ఫేజ్-II)పై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలకు సంబంధించిన రెండో దశ 100 రోజుల లక్ష్యాల సాధనపై సమీక్షించారు. లక్ష్య సాధనలో వెనకబడకూడదని ఆదేశించారు.
News October 10, 2024
సీఎం హామీలను నెరవేర్చాలి: కలెక్టర్
పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో సీఎం పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం హామీల సాధనపై సమీక్ష నిర్వహించారు. హౌసింగ్‌కు సంబంధించి 203 దరఖాస్తులు వచ్చాయని, వీటిని మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 40 మందికి ఇళ్ల స్థలాల మంజూరుకు భూమిని గుర్తించాలని డీఆర్ఓను అదేశించారు.