News February 1, 2025

నందికొట్కూరులో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మృతి

image

నందికొట్కూరుకు చెందిన రిటైర్డ్ టీచర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇందిరాబాయి (90) శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపై స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1993లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయులిగా రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు.

Similar News

News February 14, 2025

నల్గొండ: 20నాటికి లబ్ధిదారుల జాబితా పూర్తికావాలి: కలెక్టర్ త్రిపాఠి

image

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఆధారంగా అన్ని గ్రామాలలో అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఉదయాదీత్య భవన్‌లో ఎంపీడీవోలతో నమూనా ఇందిరమ్మ గృహాల నిర్మాణం, గ్రామాల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారీ, తదిత అంశాలపై సమీక్షించారు. ఈనెల 20నాటికి అన్ని గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.

News February 14, 2025

ఒడిశా హైకోర్టులో ‘పద్మశ్రీ’ పంచాయితీ!

image

ఒడిశా హైకోర్టుకి ఓ వింత పంచాయితీ చేరింది. అంతర్యామి మిశ్రా అనే పేరున్న వ్యక్తికి 2023లో సాహిత్య విభాగంలో కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆ పేరు కలిగిన జర్నలిస్టు ఢిల్లీ వెళ్లి పురస్కారం స్వీకరించారు. అయితే, అది తనకు ప్రకటిస్తే వేరే వ్యక్తి తీసుకున్నారని అదే పేరు కలిగిన వైద్యుడు హైకోర్టుకెక్కారు. దీంతో వారిద్దరినీ వారి వారి రుజువులతో తదుపరి విచారణకు కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

News February 14, 2025

రేవంత్‌వి దిగజారుడు మాటలు: కిషన్ రెడ్డి

image

TG: ప్రధాని మోదీ పుట్టుకతో BC కాదంటూ CM రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలను <<>>కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అటు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ 10 జన్‌పథ్(సోనియా ఇల్లు) నుంచే ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.

error: Content is protected !!