News October 18, 2024
నందికొట్కూరు: కోడలిని దారుణంగా చంపిన మామ

నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలో శుక్రవారం విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కురుమన్న తన కోరిక తీర్చలేదని కోడలిని దారుణంగా హత్య చేశాడు. గ్రామ శివారులోని ఓ మొక్కజొన్న పొలంలో కంకులను ఏరడానికి వచ్చిన కోడలిపై మామ కురుమన్న అత్యాచారనికి యత్నించాడు. అనంతరం అక్కడే ఉన్న బండరాయితో కొట్టి హత్యచేశాడు.
Similar News
News November 28, 2025
ఆదోని మండల విభజన గెజిట్ విడుదల

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆదోని, పెద్దహరివాణం పేర్లతో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదోని హెడ్క్వార్టర్గా 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్క్వార్టర్గా 17 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాల పునర్విభజన చేపట్టినట్లు వివరించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలన్నారు.
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.