News May 24, 2024
నందికొట్కూరు: హంద్రీ కాలువలో పడి వ్యక్తి మృతి

నందికొట్కూరు మండలం వడ్డెమాను సమీపంలోని హంద్రీనీవా కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. ఎస్సై నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. దామగట్ల గ్రామానికి చెందిన గొల్ల మధు(40) కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక తిరుగుతున్నాడు. గురువారం వడ్డెమాను హంద్రీనీవా కాలువలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News March 15, 2026
రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: డీఐజీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జనవరి 1 నుంచి ఈనెల 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఓవర్ స్పీడ్ 1,889, హెల్మెట్ లేకుండా 1,763, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 79 కేసులు నమోదు కాగా, 1,686 డ్రంకెన్ డ్రైవింగ్, 2,223 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News March 15, 2026
కర్నూలులో ‘ఆకలి కేక’

కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ కార్మికుల ఉపాధి సంక్షోభంలో పడిందని పేర్కొంటూ హోటల్, బేకరీ వంట మాస్టర్స్ యూనియన్(AITUC) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలన్నారు.
News March 15, 2026
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని కలెక్టర్ ఏ.సిరి ప్రకటించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సీసీ టీవీ, ప్రత్యేక బస్సులు, ఓఆర్ఎస్, తాగునీటి, వైద్య సౌకర్యాలు పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు.


