News September 6, 2024

నందిగం సురేశ్‌ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్‌

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆయనకు మంగళగిరి కోర్టు 2వారాలు రిమాండ్ విధించగా గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి రూరల్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Similar News

News October 10, 2024

అమరావతి: రతన్ టాటా మృతిపై సీఎం, మంత్రి మండలి సంతాపం

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతిపై సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రి మండలి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు గురువారం రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టాటా మృతి ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతరం ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

News October 10, 2024

నందిగం సురేశ్ ఫిర్యాదు.. కలెక్టర్‌కు నోటీసులు

image

తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మాజీ ఎంపీ నందిగం సురేశ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సురేశ్ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ గుంటూరు కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, మర్డర్ కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు.

News October 10, 2024

ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ ఆరోగ్య మిషన్ గుంటూరు విభాగంలో ఉద్యోగాల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి విజయలక్ష్మి బుధవారం తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శానిటరీ అటెండర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను DMHO కార్యాలయంలో అందజేయాల్సిందిగా పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.guntur.ap.gov.inలో చూడాలన్నారు.