News September 28, 2024

నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టేయండి: పోలీసులు

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని మంగళగిరి రూరల్ సీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దాడి జరిగిన సమయంలో సురేశ్ అక్కడే ఉన్నట్లు నిర్ధారించి దాడికి కుట్ర పన్నిన వారిలో ఆయనను కీలక వ్యక్తిగా పోలీసులు నివేదిక అందించారు. సురేశ్ పాత్రతో పాటు ఇతర నిందితుల పాత్రలు తేల్చాల్సి ఉన్న నేపథ్యంలో బెయిల్ కొట్టేయాలని కోరారు.

Similar News

News October 10, 2024

నందిగం సురేశ్ ఫిర్యాదు.. కలెక్టర్‌కు నోటీసులు

image

తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మాజీ ఎంపీ నందిగం సురేశ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సురేశ్ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ గుంటూరు కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, మర్డర్ కేసులో సురేశ్ నిందితుడిగా ఉన్నారు.

News October 10, 2024

ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ ఆరోగ్య మిషన్ గుంటూరు విభాగంలో ఉద్యోగాల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి విజయలక్ష్మి బుధవారం తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శానిటరీ అటెండర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను DMHO కార్యాలయంలో అందజేయాల్సిందిగా పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.guntur.ap.gov.inలో చూడాలన్నారు.

News October 10, 2024

ఈ నెల 14 నుంచి పల్లె పండుగ: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పల్లెపండుగ, పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆమె అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులను శంకుస్థాపనలు చేయాలన్నారు.