News April 11, 2025

నందిగాం: ఉపాధ్యాయుడిపై మరో పోక్సో కేసు నమోదు

image

నందిగాం మండలం దేవుపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు కొండాల గోపాలంపై గురువారం మరో పొక్సో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 22న పాఠశాల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా కేసు నమోదైనప్పటికి ఆయన రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా మరో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ అలీ తెలిపారు.

Similar News

News March 11, 2026

శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

image

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్‌కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.

News March 11, 2026

కోడి పందేల శిబిరంపై దాడి: నరసన్నపేట ఎస్సై

image

నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలోని వంశధార నది పరివాహక ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నామని ఎస్సై బి.గణేశ్ తెలిపారు. ఈ మేరకు తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం దాడి చేశామని వెల్లడించారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.10,700 స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.

News March 11, 2026

SKLM: ‘ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి’

image

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మడు రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.