News March 21, 2025
నందిగాం: జీడి చెట్టుకి ఉరేసుకుని వ్యక్తి మృతి

నందిగామ మండలం హరిదాసు పురం గ్రామానికి చెందిన అక్కురాడ డిల్లేశ్వరరావు శుక్రవారం జీడి తోటలో ఉరేసుకుని చనిపోయాడు . జీడి పిక్కలు కోయడానికి వెళ్లిన తన తమ్ముడు చూసి, పోలీసులకు సమాచారం తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు . దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 25, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 50 అర్జీలు

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. మొత్తం 50 అర్జీలు స్వీకరించామన్నారు
News March 24, 2025
SKLM: గిరిజన రైతుల శ్రమకు జాతీయ గుర్తింపు

ఏపీలోని అరకు లోయ నుంచి వచ్చిన స్వచ్ఛమైన, జిఐ ట్యాగ్ పొందిన అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటు ప్రాంగణంలో లభిస్తోందని, 1.5 లక్షల మంది గిరిజన రైతుల కఠోర శ్రమకు, సంప్రదాయానికి ప్రతీకని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటులో అరకు కాఫీ అందుబాటులోకి తీసుకురావడానికి పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహకారం ఎంతో గొప్పదని, వారిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
News March 24, 2025
శ్రీకాకుళం: జిల్లాలో నేడు ఈ మండలాల వారికి అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాల్లో సోమవారం ఎండ తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది. జిల్లాలోని బూర్జ, హిరమండలం, ఎల్.ఎన్ పేట, సరుబుజ్జిలి మండలాల్లో 37 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రతగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిన్నారులు, వృద్ధులు విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.