News August 6, 2024

నందిగాం: రాయితీ పై వ్యవసాయ పరికరాలు

image

జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు సూక్ష్మ నీటి పారుదల పధకం ద్వారా బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీ పై అందివ్వనున్నట్లు ఆ పధక అధికారి ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది 2400 ఎకరాల్లో సాగు లక్ష్యంగా రూ.11.17 కోట్లు రాయితీ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. బిందు, తుంపర సేద్య పరికరాలు రాయితీ పై పొందుటకు రైతులు సమీప రైతు సేవా కేంద్రాలు, మండల ఉద్యానవనాధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Similar News

News November 18, 2025

శ్రీకాకుళం: స్టాప్ మీటింగ్‌లో కుప్ప కూలిన అధ్యాపకుడు

image

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర కళాశాల తెలుగు అధ్యాపకుడు పప్పల వెంకటరమణ మంగళవారం కళాశాలలో స్టాప్ మీటింగ్ జరుగుతుండగా కుప్ప కూలిపోయాడు. మీటింగ్‌లో ఒక్కసారిగా కింద పడిపోవటంతో స్పందించిన తోటి అధ్యాపకులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరమణ పొందూరు మండలం ధర్మపురం కాగా, శ్రీకాకుళంలోని PM కాలనీలో నివాసం ఉంటున్నారు.

News November 18, 2025

గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

image

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.