News October 29, 2024

నందిగాం: వైసీపీ నేత తిలక్‌ను అడ్డుకున్న పోలీసులు

image

పలాస పోలీస్ స్టేషన్‌లో దాడులకు గురైన వైసీపీ నాయకులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్‌ను నందిగాం వద్ద సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. టెక్కలి సీఐ శ్రీనివాసరావు, నందిగాం ఎస్సై అలీ సిబ్బందితో నందిగాం సమీపంలో పలాస వెళ్లకుండా అడ్డుకున్నారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించే నైతిక హక్కు కూడా పార్టీ నాయకులకు లేకుండా చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.

Similar News

News November 28, 2025

సిక్కోలుపై తుఫాన్ ప్రభావం..!

image

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా శ్రీకాకుళం జిల్లా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ సూచించారు.

News November 28, 2025

శ్రీకాకుళం: వర్షాలపై అప్రమత్తం.. ధాన్యం సేకరణపై దృష్టి

image

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.