News February 13, 2026

నందిగామ పాలిటెక్నిక్ కళాశాలలో యువతులకు ఉచిత శిక్షణ

image

నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీ నందిగామలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ అర్హత గల మహిళలకు 2 నెలల డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సు, 5వ తరగతి పైబడిన వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 20 లోపు నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News March 9, 2026

BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.

News March 9, 2026

వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

image

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.

News March 9, 2026

కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

image

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.