News January 27, 2025
నందిగామ: మతిస్తిమితం లేని మహిళపై లైంగిక దాడికి యత్నం

నందిగామ మండలం రాఘవాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో మతిస్తిమితి లేని మహిళపై కృపానందం అనే వృద్ధుడు పొలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయండంతో చుట్టు పక్కల పొల్లాలోని రైతులు అక్కడకు వచ్చారు. దీంతో కృపానందం పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 4, 2025
జూబ్లీ బైపోల్: EVMలు రెడీ.. 11 వరకు వెయిటింగ్

ఈ నెల 11వ తేదీ జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి అధికారులు కీలక ఘట్టం పూర్తిచేశారు. 58 మంది అభ్యర్థుల పేర్లు, గుర్తుతోపాటు నోటాను ఈవీఎంలలో సిద్ధం చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అధికారులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసి ఈ తంతు ముగించారు. ఎలక్షన్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో ఈ నిక్షిప్త కార్యక్రమం నిర్వహించారు.
News November 4, 2025
జూబ్లీలో నేడే పోలింగ్.. అదీ ఇంటి వద్దే

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ ప్రక్రియ ఈరోజు నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో కాదులెండీ.. ఇంటి వద్దే. తాము పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేమని దివ్యాంగులు, వృద్ధులు ఈసీ వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో 103 మంది ఓటర్ల ఇంటి వద్దకే అధికారులు వెళ్లి ఓటు వేయిస్తారు. సంచార ఓటరు కేంద్రం ఇందుకు సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ రోజు ఈ ప్రక్రియ ముగియకపోతే గురువారమూ కొనసాగిస్తారు.
News November 4, 2025
న్యూస్ అప్డేట్స్

* TG: 1,037 ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ G.O. జారీ. 2026 మార్చి 31 వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్ను కోరిన సీఎం రేవంత్
* సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను సహించం: ఏపీ హోంమంత్రి అనిత
* మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని TG సర్కార్ ఆదేశం


