News February 4, 2025
నందిగామ మున్సిపల్ ఎన్నిక జరిగిందిలా..

నందిగామలో 3 రోజుల ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై MLA సౌమ్య, MP చిన్ని ప్రతిపాదించిన పేర్లు కాకుండా అధిష్ఠానం మండవ కృష్ణకుమారి పేరు తెచ్చింది. ఏకగ్రీవం అనుకున్న ఓటింగ్‌కి YCP అనూహ్యంగా పోటీలోకి వచ్చింది. దీంతో ఓటింగ్ తప్పలేదు. TDPకి 15, YCPకి 3 ఓట్లు పడడంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. 2020లో YCPకి 13 మంది బలం ఉండగా ఇప్పుడు 3కే పరిమితమవడం గమనార్హం.
Similar News
News January 22, 2026
SRPT: దమ్ము చక్రాలతో వస్తే జరిమానా: ఎస్పీ నరసింహ

రోడ్లపై దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. రహదారులు ధ్వంసమై ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రోడ్లను కాపాడుకోవాలని, రైతులు, ట్రాక్టర్ యజమానులు సహకరించాలని కోరారు.
News January 22, 2026
రోహిత్ శర్మకు డాక్టరేట్

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు మరో గౌరవం దక్కనుంది. క్రికెట్‌లో ఆయన చేసిన సేవలకు గాను డాక్టరేట్ అందజేయనున్నట్లు అజింక్య డీవై పాటిల్ వర్సిటీ వెల్లడించింది. పుణేలో ఈ శనివారం జరగనున్న వర్సిటీ 10వ స్నాతకోత్సవ కార్యక్రమంలో హిట్‌మ్యాన్‌కు డాక్టరేట్ ప్రదానం చేయనుంది. రోహిత్ కెప్టెన్‌గా, ఆటగాడిగా భారత జట్టుకు టీ20 WC, ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఎన్నో విజయాలు అందించారు.
News January 22, 2026
గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

గర్భిణులు రోజుకి 3.8 గ్రాముల ఉప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. తప్పనిసరి పరిస్థితుల్లో 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరీ తక్కువ ఉప్పు తీసుకున్నా బలహీనత, అలసట, నీరసం వంటివన్నీ వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో మాత్రమే ఉప్పు తీసుకోవాలని చెబుతున్నారు.


