News February 4, 2025

నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కృష్ణకుమారి

image

ఆసక్తికర పరిణామాల మధ్య నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక ముగిసింది. రెండు వర్గాలు ఛైర్మన్ పదవికి పోటీపడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే నిన్న జరగాల్సిన ఎన్నిక నేటికి వాయిదా పడింది. చివరకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతుతో నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారిని ఎన్నుకున్నారు. ఈమె గత ఎన్నికల్లో 10వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆమె అనుచరులు సంబరాలు చేసుకున్నారు.

Similar News

News November 22, 2025

పరకామణి కేసు.. శ్రీనివాసులుకు భద్రత కల్పించండి: హైకోర్టు

image

AP: పరకామణి <<18290953>>కేసులో<<>> పిటిషనర్ శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ దర్యాప్తు కోరుతూ శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఫిర్యాదుదారు సతీశ్ అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే.

News November 22, 2025

నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం

image

నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులుగా తీలేరు గ్రామానికి చెందిన కే.ప్రశాంత్ కుమార్ రెడ్డి రెండోసారి నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేసీ. వేణుగోపాల్ శనివారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల జాబితాలో ప్రశాంత్ కుమార్ రెడ్డికి చోటు లభించింది. ఆయన సీఎం, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

News November 22, 2025

గద్వాల డీసీసీ అధ్యక్షుడుగా రాజీవ్ రెడ్డి నియామకం

image

చాలాకాలంగా పరిశీలనలో ఉన్న డీసీసీ అధ్యక్షుల నియామకాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా గద్వాల డీసీసీ అధ్యక్షుడుగా రాజీవ్ రెడ్డిని నియమించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన రాజీవ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.