News February 4, 2025

నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కృష్ణకుమారి

image

ఆసక్తికర పరిణామాల మధ్య నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక ముగిసింది. రెండు వర్గాలు ఛైర్మన్ పదవికి పోటీపడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే నిన్న జరగాల్సిన ఎన్నిక నేటికి వాయిదా పడింది. చివరకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతుతో నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారిని ఎన్నుకున్నారు. ఈమె గత ఎన్నికల్లో 10వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆమె అనుచరులు సంబరాలు చేసుకున్నారు.

Similar News

News February 19, 2025

VZM: పెండింగ్‌ చలానాలు చెల్లించాలి 

image

పెండింగ్‌లో ఉన్న ఈ చలనాలను వాహనదారులు చెల్లించే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఈ చలనాలు విధించినప్పటికీ చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ చలానాలు చెల్లించే వరకు వాహనాలు సీజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News February 19, 2025

రేపు కాగజ్ నగర్‌కు మంత్రి సీతక్క

image

రేపు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాగజ్‌నగర్‌లో పర్యటిస్తారని ఎమ్మెల్సీ దండే విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని, ఈ సమావేశానికి పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని అన్నారు.

News February 19, 2025

HYD: ఆ ఫ్లాట్లు కొని ఇబ్బంది పడొద్దు!

image

అనుమ‌తి లేని లే అవుట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు ప‌డొద్ద‌ని హైడ్రా సూచించింది. HYD శివార్ల‌లో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని, వీటిని కొన్నవారు త‌ర్వాత ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ల‌పై నిషేదం ఉన్న‌ప్ప‌టికీ, కొన్ని ప్రాంతాల్లో అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని హైడ్రాకు వ‌చ్చిన ఫిర్యాదుల మేర‌కు తెలుస్తోందని కమిషనర్ రంగనాథ అన్నారు.

error: Content is protected !!