News March 28, 2025
నందిమల్ల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

అమరచింత మండలంలోని నందిమల్ల గ్రామంలోని పెద్ద చెరువులో ఒక వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజ్ (30) శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. బెండుపై కూర్చొని వల విసురుతుండగా ప్రమాదవశాత్తు బెండుపై నుంచి జారిపడి వలలో చిక్కుకొని మృతి చెందాడు. కాగా మృతునికి భార్య పావనితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
Similar News
News November 21, 2025
KNR: మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా పర్యటన రద్దు

నేడు కరీంనగర్లో జరగాల్సిన మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన వాయిదా పడింది. హైదరాబాదులో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రోగ్రాం వాయిదా పడ్డట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. LMD వద్ద నిర్వహించనున్న చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారని, కొత్తపల్లి మండలంలో నిర్వహించే మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీనిని మరోరోజు నిర్వహించనున్నారు.
News November 21, 2025
KNR: TGNPDCL డిజిటల్ సేవలు..!

మెరుగైన సేవలకు TGNPDCL యాప్ తీసుకొచ్చింది. దీంతో న్యూకనెక్షన్, సెల్ఫ్ రీడింగ్, పేబిల్స్, బిల్స్ హిస్టరీ, లోడ్ ఛేంజ్, కంప్లైంట్ స్టేటస్ వంటి 20రకాల డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా కూడా కరెంట్ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అప్లికేషన్ నమోదు నుంచి సర్వీస్ రిలీజ్ వరకు సేవలు పొందొచ్చు. ప్లేస్టోర్‌లో యాప్ డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ సేవలు ఆస్వాదించాలని అధికారులు కోరుతున్నారు.
News November 21, 2025
NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఎలాంటి టోర్నీలు జరగ లేదు.


