News April 16, 2025
నందిమల్ల: త్రిశంకు స్వర్గంలా జూరాల ప్రాజెక్టు

వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల సమీపంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు త్రిశంకు స్వర్గంలా మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో ప్రాజెక్టులు నిల్వ నీరు లేకపోవడం, తాగునీటికి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయడం, ఉన్న నీటితో సాగునీరుకు రైతులకు ఎక్కువ నీటిని విడుదల చేయలేకపోవడంతో జూరాల ప్రాజెక్టు త్రిశంక స్వర్గంలా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Similar News
News November 6, 2025
ADB: తండ్రీ, కొడుకుకు 20 ఏళ్ల జైలు

మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులో తండ్రీ, కొడుకులకు ADB పోక్సో కోర్టు న్యాయమూర్తి శివరాంప్రసాద్ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఘాతుకానికి సహకరించిన మహిళకు 3 నెలల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది FEB 14న సుష్మా అనే మహిళ బాధిత బాలికను ఇంటికి పిలిచి బయట నుంచి తలుపులు వేసింది. ఆ మహిళ భర్త అనిల్, తండ్రి గంగాధర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
News November 6, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,051, కనిష్ఠ ధర రూ.1,700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.1,901, కనిష్ఠ ధర రూ.1,775, వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2,061, కనిష్ఠ ధర రూ.1,910, వరి ధాన్యం (HMT) ధర రూ.1,850, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2,480, కనిష్ఠ ధర రూ.1,850గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 6, 2025
మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

బోరాన్ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


