News February 20, 2025
నంద్యల: గమనిక.. బస్సుల రూటు మార్పు

కోవెలకుంట్ల ఆర్టీసీ డిపో నుంచి కర్నూలుకు వెళ్లే బస్సుల మార్గంలో స్వల్ప మార్పులు చేసినట్లు కోవెలకుంట్ల డిపో మేనేజర్ తిరుపతయ్య పేర్కొన్నారు. జాతీయ రహదారి NH-340B చెన్నంశెట్టి పల్లె నుంచి బేతంచెర్ల వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున బేతంచెర్ల నుంచి కర్నూలు వెళ్లే బస్సులు సిమెంట్ నగర్, తమ్మరాజు పల్లె, సోమయాజుల పల్లె మీదుగా నేటి నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
Similar News
News November 25, 2025
వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లు: పార్థసారథి

AP: ఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్లు కట్టివ్వాలన్న లక్ష్యంలో ఇప్పటికే 3 లక్షలు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘ఇళ్లులేని నిరుపేదలకు 2029కల్లా శాశ్వత గృహ వసతి కల్పిస్తాం. వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లను పూర్తి చేస్తాం. ఉగాదికి 5 లక్షలు, జూన్కి మరో 87వేల గృహాలను పూర్తి చేయాలని పని చేస్తున్నాం. CM ఆదేశాల మేరకు 3 నెలలకోసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’ అని తెలిపారు.
News November 25, 2025
నర్సంపేటలో విషాదం.. పుట్టినరోజునే మృత్యుఒడికి!

నర్సంపేట పట్టణంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో వివాహిత మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రత్యూష ఇంటి ప్రాంగణంలో ఆరుబయట ఆరవేసిన బట్టలు తీస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు 8 నెలల గర్భిణి కాగా.. ఇవాళ ఆమె పుట్టినరోజు అని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.
News November 25, 2025
ప్రకాశం: రహదారి దాటుతున్నారా.. ఈ రూల్స్ తెలుసుకోండి.!

రహదారి దాటుతున్నారా.. కాస్త రూల్స్ పాటించండి అంటున్నారు ప్రకాశం పోలీస్. ఇప్పటికే సైబర్ నేరాలపై, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్న ప్రకాశం పోలీసులు మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశారు. రహదారులు దాటే సమయంలో ప్రతి ఒక్కరూ జీబ్రా లైన్లను ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తప్పనిసరిగా సిగ్నల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.


