News May 21, 2024

నంద్యాల:యువకుడిపై గొడ్డలితో దాడి

image

మహానంది మండలం గాజులపల్లెకి చెందిన ఆల్తాఫ్ అదే గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌పై గొడ్డలితో దాడిచేశాడు. ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు.. స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఇర్ఫాన్ ఉండగా ఆల్తాఫ్ తన మిత్రులతో కలిసి అతడిపై దాడికి దిగారు. గొడ్డలితో తలపై దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన ఇర్ఫాన్‌ను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 14, 2025

చెత్త సేకరణ సక్రమంగా జరగాలి: కర్నూలు కలెక్టర్

image

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగాలని కర్నూలు కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలు చెత్త సేకరణలో చివరి స్థానాల్లో ఉన్నాయని, వెంటనే మెరుగుపరచాలని సూచించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 63 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

News November 13, 2025

కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సీఐలు, ఎస్సై, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్‌లో అనుమానిత వ్యక్తులు, వాహనాలు, పార్సిల్ కార్యాలయాలను పోలీసులు పరిశీలించారు.

News November 13, 2025

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌‌లో సమర్పించాలని సూచించారు.