News May 21, 2024
నంద్యాల:యువకుడిపై గొడ్డలితో దాడి
మహానంది మండలం గాజులపల్లెకి చెందిన ఆల్తాఫ్ అదే గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌పై గొడ్డలితో దాడిచేశాడు. ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు.. స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఇర్ఫాన్ ఉండగా ఆల్తాఫ్ తన మిత్రులతో కలిసి అతడిపై దాడికి దిగారు. గొడ్డలితో తలపై దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన ఇర్ఫాన్‌ను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 14, 2024
KNL: నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు
కర్నూలు జిల్లాలో నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేసీ కెనాల్, SRBC, తెలుగు గంగ, మైనర్ ఇరిగేషన్, మైలవరం పరిధిలోని ఆయకట్టు రైతులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సుమారు 3లక్షల మంది రైతులు నేడు ఓటేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. పలు చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
News December 14, 2024
అల్లు అర్జున్ అరెస్ట్.. స్పందించని శిల్పా రవి!
తన మిత్రుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంకా స్పందించలేదు. నిన్న మధ్యాహ్నం బన్నీ అరెస్ట్ కాగా శిల్పా రవి ఇంకా స్పందించకపోవడంతో ఫ్యాన్స్ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే శిల్ప రవి నిన్న నంద్యాలలో జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో అల్లు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News December 14, 2024
నంద్యాల కేసులో ఊరట! కానీ..
తనపై నంద్యాలలో నమోదైన కేసులో ఉపశమనం పొందిన హీరో అల్లు అర్జున్ మరో కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల వేళ బన్నీపై నంద్యాలలో కేసు నమోదు కాగా ఇటీవలే ఏపీ HC కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే పుష్ప-2 ప్రీమియర్ షో వీక్షించేందుకు HYDలోని సంధ్య థియేటర్‌కు బన్నీ రాగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. మహిళ మృతి చెందడంతో నమోదైన కేసులో ఆయన ఒకరోజు జైలులో గడపాల్సి వచ్చింది.