News April 4, 2025
నంద్యాలలో ఈనెల 10న జాబ్ మేళా

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏప్రిల్ 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 14 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech (Mechanical), B/D/M.Pharmacy, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
Similar News
News April 17, 2025
వనపర్తి: ప్రతికూలీకి 6 రోజులు కూలి ఇవ్వాలి: అబ్రహం

వనపర్తి జిల్లాలో ఉపాధి హామీ కూలీలు వారంలో 6 రోజులు పనిచేస్తే 4 రోజులు మాత్రమే కూలి ఇస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అబ్రహం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 4 రోజులకు కూడా కేంద్రం నిర్ణయించిన రోజుకూలీ రూ.307 కాకుండా, రోజుకు రూ.300లే ఇస్తున్నారన్నారు. తీవ్రమైన ఎండలకు భూమి గట్టిపడి తెరగటం లేదని, ప్రతిరోజూ కనీసం రూ.600 కూలీ ఇవ్వాలన్నారు. లేదంటే కూలీలను కూడ గట్టి ఆందోళన చేస్తామన్నారు.
News April 17, 2025
ASF: ఉద్యోగాలు.. APPLY NOW

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25వ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 17, 2025
కరణం పురుషోత్తంరావుకు ఉగాది నంది పురస్కారం

తాండూరుకు చెందిన సీనియర్ రాజకీయ నేత, సామాజిక వేత్త, న్యాయవాది కరణం పురుషోత్తం రావు ఉగాది నంది పురస్కారం అందుకున్నారు. ఉజ్వల సాంకేతిక సేవా సంస్థ నిర్వహించిన ఉగాది నంది పురస్కారం, అవార్డులు-2025లో భాగంగా ఆయన ఎంపిక అయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పురుషోత్తం రావుకు ఉగాది నంది అవార్డు అందజేశారు.