News November 16, 2024
నంద్యాలలో ఉచిత శిక్షణ

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 19 నుంచి MIS Data Analystపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ శశికళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ఆపై చదివినవారు అర్హులన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం కంపెనీల్లో ఉద్యోగాలు కలిపిస్తారన్నారు. ఆసక్తి ఉన్నవారు tinyurl.com/misdatagdcndlలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 15, 2026
పీజీఆర్ఎస్ అర్జీలకు వేగవంత పరిష్కారం: కలెక్టర్

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్‌లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.
News April 15, 2026
కర్నూలు జిల్లా విద్యార్థుల ప్రతిభ ఇలా..

కర్నూలు జిల్లా ఇంటర్ ఫలితాల వివరాలను ఆర్ఐఓ లాలప్ప వెల్లడించారు. ఉత్తీర్ణతలో బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 97%, ద్వితీయ సంవత్సరంలో 100% ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఏపీఆర్ఎస్ నుంచి 91%, 97% సాధించగా, ప్రభుత్వ కళాశాలలు 44%, 71% ఫలితాలు నమోదు చేశాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు 71%, 85% ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థుల ప్రతిభపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.