News August 6, 2024

నంద్యాలలో ‘ఏం తీసుకెళ్లలేదు’ అంటూ చీటీ రాసిన దొంగ

image

నంద్యాల జిల్లా చాబోలులోని ఓ అగ్రికల్చల్ డ్రోన్ షాపులో ఓ దొంగ చోరీకి యత్నించాడు. అయితే దుకాణంలో డబ్బు దొరకకపోవడంతో ‘అన్నా.. చోరీకి వచ్చా. కానీ ఏమీ తీసుకెళ్లలేదు’ అంటూ ఓ చీటీపై రాసి అక్కడ వదిలి వెళ్లారు. దుకాణానికి వచ్చిన యజమాని నాగేశ్వర్ రెడ్డి ఆ చీటీ చూసి ఆశ్చర్యపోయారు. షాప్‌లో రూ.10 లక్షల విలువ చేసే సామగ్ర ఉందని దొంగ వాటిని చోరీ చేయలేదని చెప్పారు. ఆదివారం జరిగిన ఈ ఘటన తాజాగా వైరల్‌గా మారింది.

Similar News

News September 17, 2024

17,523 ఎకరాల్లో పంట నష్టం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న 17,523 ఎకరాల పంటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 400 ఎకరాలలో గుర్తించిన పండ్లతోటల పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. 57 ఆయిల్ ఫామ్ ప్లాంట్లను ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పశుసంపదకు డీ వార్మింగ్, వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.

News September 17, 2024

ప్రతి విద్యార్థి చేత ఆల్బెండజోల్ మాత్రలు మింగించండి: కలెక్టర్

image

జాతీయ నులిపురుగుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి విద్యార్థి చేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని కలెక్టర్ రాజకుమారి ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే నులిపురుగుల నివారణ మాత్రలు మింగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి గురువారం పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే ఐరన్ పోలీక్ ఆసిడ్ మాత్రలను తప్పనిసరిగా మింగాలని ఆమె తెలిపారు.

News September 17, 2024

మొక్క నాటిన డ్వామా పీడీ

image

‘ఏక్ పేడ్ మాకే నామ్’లో భాగంగా జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ రామచంద్రా రెడ్డి చాగలమర్రిలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణంలో మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని పిలుపు మేరకు మొక్కలు నాటుతున్నామన్నారు. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు గుర్తుగా చెట్టు నాటాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ నిర్మల, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.