News January 25, 2025

నంద్యాలలో డ్రోన్ల వినియోగంతో ట్రాఫిక్ పర్యవేక్షణ

image

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాలలోని సంజీవ నగర్ గేట్, మున్సిపల్ ఆఫీస్, శ్రీనివాస సెంటర్‌లో శుక్రవారం ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు అధికారులు డ్రోన్‌లను వినియోగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి జరిమానా విధించారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ గురించి వాహనదారులకు వివరించారు.

Similar News

News February 15, 2025

నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్‌లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 15, 2025

సోమనాథ్ క్షేత్రం ప్రత్యేకతలు మీకు తెలుసా… !

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో గుజరాత్‌లో ఉండే సోమనాథ్ క్షేత్రం మెుదటిది. చంద్రునికి శాపవిముక్తి కలిగించిన ప్రదేశం కాబట్టి దీనికి సోమనాథ క్షేత్రంగా పేరొచ్చిందని ప్రతీతి. చంద్రుడు ఈక్షేత్రాన్ని బంగారంతో నిర్మించగా, రావణాసురుడు వెండితో, శ్రీ కృష్ణుడు చందనపు చెక్కలతో నిర్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. గజనీ మహమ్మద్ సహా అనేక మంది దాడి చేసి సంపద దోచుకెళ్లగా 1951లో పునర్నిర్మించి ప్రారంభించారు.

News February 15, 2025

‘విశ్వంభర’లో మెగా హీరో?

image

చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ మూవీలో మెగా హీరో సాయి దుర్గతేజ్ అతిథి పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ షూట్‌లో ఆయన పాల్గొన్నారని తెలిపాయి. మరోవైపు చిరు ఇంట్రో సాంగ్ షూట్ జరుగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. దీంతో ఆయన సాంగ్‌లో కనిపిస్తారని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు చిరంజీవి సినిమాలోని సాంగ్స్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!