News September 30, 2024

నంద్యాలలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

నంద్యాలలోని కలెక్టరేట్ సెంటినరీ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 22, 2025

కర్నూలు: 633 మందికి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం

image

శిక్షణే ఒక పోలీసు భవిష్యత్‌కు పునాదని క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవే నిజమైన పోలీసు శక్తి” అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం అన్నారు. కర్నూల్ APSP రెండవ బెటాలియన్ శిక్షణా కేంద్రం, DTC కర్నూలులో 633 మంది స్టైపిండరీ కానిస్టేబుళ్లకు 9నెలల ప్రాథమిక శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శిక్షణా కాలంలో ప్రతి రిక్రూట్ బాధ్యతాయుతమైన, ప్రజాభిముఖ పోలీసుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.

News December 22, 2025

ఫిర్యాదులపై చట్టపర చర్యలు: కర్నలు SP

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. మోసాలు, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, దాడులు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.

News December 22, 2025

కర్నూలు: విద్యుత్ సమస్యల పరిష్కారంపై అవగాహణ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు APSPDCL ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం గ్రామాలు, పట్టణ వార్డుల్లో విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ SE ప్రదీప్ కుమార్ ఉన్నారు.