News April 14, 2025
నంద్యాలలో నేడు PGRS రద్దు

నంద్యాలలో నేడు నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని వివరించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరోవైపు ఎస్పీ కార్యాలయంలోనూ ఈ కార్యక్రమం జరగదని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు.
Similar News
News December 3, 2025
APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

APPSC ఈ క్యాలెండర్ ఇయర్లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <
News December 3, 2025
WGL: అన్నా.. నాతో కాదన్నా..!

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు అనుకూలించినా, ‘అన్నా నాతో కాదన్న’ అంటూ అభ్యర్థులు నామినేషన్ల ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారు. గతంలో ముఖం చూసి ఓట్లు వేసేవారని, ఇప్పుడు ‘లకారాలు (డబ్బు)’ పెట్టినా గెలుపు కష్టమనే అభిప్రాయాలు పెరిగాయి. పాత సర్పంచ్లు బిల్లులు రాక ఇబ్బంది పడుతుండటంతో, పోటీకి దిగేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొందని పలువురు నేతలు చెబుతున్నారు.
News December 3, 2025
టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్( టైర్ 1, టైర్ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్సైట్: mha.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


